: బీహార్‌లో దారుణం.. ఆడపిల్ల పుట్టిందని కోడలికి నిప్పంటించిన వైనం


బీహార్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆడపిల్ల పుట్టిందనే కార‌ణంతో మహంత్‌ మనియారి అనే గ్రామంలో షర్మిల సాహాను అనే మ‌హిళ‌కు అత్తింటి వారు నిప్పంటించారు. దీంతో ష‌ర్మిల శ‌రీరం తీవ్రంగా కాళింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో ఆమె చికిత్స‌ పొందుతోంది. షర్మిల పెళ్లైనప్పటి నుండి అత్తింటివారి నుంచి వేధింపులు ఎదుర్కుంటోంద‌ని, అదనపు కట్నం తేవాల‌ని ఆమెను వేధించేవార‌ని పోలీసులు తెలిపారు. పది నెలల క్రితం షర్మిల ఆడ‌శిశువుకి జ‌న్మ‌నివ్వ‌డంతో అత్తింటి వారు మ‌రింత రెచ్చిపోయార‌ని, ఈరోజు ష‌ర్మిల ఒంటికి నిప్పంటించి ఆమెపై హ‌త్యాయ‌త్నం చేశార‌ని చెప్పారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News