: స్కూలుకొస్తున్నారు... పడిపోతున్నారు!: చినకాపవరంలో వింత వ్యాధి!


పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం చినకాపవరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను వింత వ్యాధి పట్టి పీడిస్తోంది. అంతుచిక్కని వ్యాధి కారణంగా పాఠశాలకు హుషారుగా వస్తున్న విద్యార్థులు తరగతి గదిలోకి అడుగుపెట్టగానే కింద పడిపోతున్నారు. తొలుత ఉపాధ్యాయులు అంతగా పట్టించుకోకున్నా... వరుసగా 15 రోజుల పాటు రోజూ ఒకరో ఇద్దరో ఇలా పడిపోతుండటంతో అక్కడ ఆందోళనకర పరిస్థితి నెలకొంది. పడిపోతున్న విద్యార్థులంతా ఆడపిల్లలే కావడం గమనార్హం. ఇంటి నుంచి హుషారుగానే పాఠశాలకు వస్తున్న విద్యార్థులు తరగతి గదిలోకి ప్రవేశించగానే తల నొప్పి వస్తోందని చెప్పడం, కింద పడిపోవడం జరుగుతోంది. దీంతో ఏదో వింత వ్యాధి పిల్లలను పట్టి పీడిస్తోందని నిర్ధారించుకున్న ఉపాధ్యాయులు, గ్రామస్థులు వైద్యాధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో రంగంలోకి దిగిన వైద్యులకు కూడా పిల్లలను పట్టి పీడిస్తున్న వ్యాధి ఏమిటో అవగతం కాలేదు. వెరసి పాఠశాలకు వరుసగా మూడు రోజులు సెలవు ప్రకటించిన వైద్యాధికారులు గ్రామంలోని అందరికీ సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News