: భారత్‌ను అస్థిరపరచేందుకు పాక్ కుట్ర: లోక్‌సభలో రాజ్‌నాథ్‌సింగ్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నాలుగోరోజు కొనసాగుతున్నాయి. కశ్మీర్ అంశంపై లోక్‌సభలో ఈరోజు చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కశ్మీర్‌లో చెలరేగిన అల్లర్లపై సమాధానం ఇచ్చారు. కశ్మీర్ అంశంపై చర్చ అవసరమేనని ఆయన అన్నారు. కశ్మీర్ అల్లర్ల అంశాన్ని ప్రధాని మోదీ నిశితంగా పరిశీలిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మోదీ బిజీబిజీగా విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు కూడా కశ్మీర్ ఆందోళనల అంశం గురించి విచారం వ్యక్తం చేశారని ఆయన పేర్కొన్నారు. ‘భారతీయులంతా కలిసే ఉంటారు.. భిన్నత్వంలో ఏకత్వమే మనదేశ ప్రత్యేకత. కశ్మీర్ అల్లర్ల వెనుక పాకిస్థాన్ హస్తం ఉంది. కశ్మీర్ పరిస్థితులకు పూర్తి బాధ్యత ఆ దేశానిదే. భారత్ లో ఉగ్రవాదులు పాక్ మద్దతుతోనే పనిచేస్తున్నారు’ అని రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.