: తీవ్ర ఒత్తిడి, బలవంతం మధ్య సహానాగా మారిన హిందూ యువతి అపర్ణ!


ఇది హిందువులందరికీ షాక్ కలిగించే సంఘటన. కేరళలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న హిందూ యువతి అపర్ణ, కొందరి బలవంతంతో తీవ్ర ఒత్తిడి మధ్య ముస్లిం మతం స్వీకరించి సహానాగా మారింది. ఈ విషయం అపర్ణ తల్లి మినీ విజయన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఆమెను ప్రస్తుతం కోజికోడ్ లో ఉంచినట్టు తెలుస్తోందని, తన బిడ్డను తనకు తెచ్చివ్వాలని వేడుకుంది. తిరువనంతపురం పరిధిలోని పాంగోడే ప్రాంతానికి చెందిన విజయన్ ఫిర్యాదుతో కేరళలో మాయమైన వారి సంఖ్య 20కి పెరిగింది. మతం మార్చుకున్న వారిలో అత్యధికులు మాయం అవుతుండటం కేరళలో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నిమిష అనే యువతి ఫాతిమాగా మారి, ఆపై అదృశ్యం అయిన సంగతి తెలిసిందే. కాగా, అపర్ణ ఎర్నాకులంలోని జూల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్వహిస్తున్న కాలేజీలో 2013 నుంచి విద్యను అభ్యసిస్తూ హాస్టల్ లో ఉంటున్నట్టు తెలిసింది. ప్రస్తుతం కోజికోడ్ లో ముస్లిమేతరులను ముస్లిం మంతంలోకి మార్చేలా ప్రచారం నిర్వహించే 'సత్య సారిని' అనే ఇనిస్టిట్యూట్ లో ఆమెను పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. యువతితో సంప్రదింపులు జరిపేందుకు యత్నిస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మాయమైన వారిలో అత్యధికులు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదానికి ప్రభావితులు అయినవారేనని తెలుస్తుండగా, వీరిలో కొందరు ఇప్పటికే దేశం దాటి ఉగ్రవాదులుగా మారిపోయారన్న వార్తలు గత నెలలో వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News