: తెలంగాణలో ప్రధాని పర్యటన ఖరారు!... ఏర్పాట్లలో తలమునకలైన టీఎస్ అధికారులు!


తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన దాదాపుగా ఖరారైంది. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం నోరు విప్పకున్నా... ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల కోసం ఉన్నతాధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్ లు... ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో తలమునకలయ్యారు. వచ్చే నెల 7న తెలంగాణకు రానున్న ప్రధాని మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అదే విధంగా ఆదిలాబాదు జిల్లాలో కొత్తగా ఏర్పాటైన ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. తెలంగాణ సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్ లోని కోమటిబండలో పర్యటించనున్న మోదీ... అక్కడే మిషన్ భగీరథకు శ్రీకారం చుడతారు. ఈ మేరకు కోమటిబండలో ప్రధాని ల్యాండింగ్ కు సంబంధించి మూడు హెలిప్యాడ్లను, దాదాపు 2 లక్షల మంది ప్రజలు పాలుపంచుకునేలా భారీ సభా ప్రాంగణం ఏర్పాటవుతున్నాయి. ఈ మేరకు వీటిని శ్రీకాంత్ రెడ్డి, ఎస్పీ సింగ్ లు నేటి ఉదయం పరిశీలించారు.

  • Loading...

More Telugu News