: టీడీపీని వీడనున్న మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి!


మాజీ మంత్రి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో నంబర్ 2గా చక్రం తిప్పిన దివంగత ఎలిమినేటి మాధవరెడ్డి సతీమణి ఉమా మాధవరెడ్డి పార్టీని వీడనున్నట్టు తెలుస్తోంది. అయితే, ఆమె మరో పార్టీని ఎంచుకుంటే అది అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కాదని కూడా తెలుస్తోంది. ఆమె కాంగ్రెస్ లో చేరుతారని, ఇందుకు సంబంధించి ఆ పార్టీ శాసనసభా పక్ష నేత జానారెడ్డి, ఉమల మధ్య చర్చలు జరిగాయని సమాచారం. తెలంగాణలో టీడీపీ మనుగడకు అవకాశాలు లేవని భావిస్తున్న ఆమె, తన కార్యకర్తల సూచన మేరకు పార్టీని వీడే నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఆమె రాకపై పార్టీ అధిష్ఠానానికి సమాచారం ఇచ్చి, ముహూర్తాన్ని ఖరారు చేసి, ఓ భారీ బహిరంగ సభ ద్వారా ఘనంగా స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు మొదలు పెట్టనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News