: లక్నోలో తీవ్ర ఉద్రిక్తత.. దయాశంకర్ సింగ్‌ను అరెస్టు చేయాల్సిందేనని బీఎస్‌పీ ఆందోళన
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) అధినేత్రి మాయావతిపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత దయాశంకర్ సింగ్ పై బీజేపీ అధిష్ఠానం చర్యలు తీసుకున్నప్పటికీ బీఎస్‌పీ కార్యకర్తల ఆగ్రహం చల్లారడం లేదు. బీజేపీ ఉత్తరప్రదేశ్ ఉపాధ్యక్ష పదవి నుంచి దయాశంకర్ సింగ్ ను తొలగించిన సంగతి తెలిసిందే. దయాశంకర్ సింగ్‌కు ఆ శిక్ష సరిపోదంటూ ఆయనను అరెస్టు చేయాల్సిందేనంటూ బీఎస్‌పీ కార్యకర్తలు ఈరోజు లక్నోలో పెద్దఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. వేలాదిమంది కార్యకర్తలు ధర్నాలో పాల్గొని దయాశంకర్ సింగ్ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పలువురిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కి తరలించారు.