: ట్రంప్ కు కేన్సర్ భయం, హిల్లరీకి హైపో థైరాయిడిజమ్!


ప్రజల్ని పాలించేవారు ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత సమర్థవంతమైన పాలన ఉంటుంది... వినేందుకు ఇది కాస్త అసంబద్ధంగానే ఉన్నప్పటికీ, పాలకులు ఆరోగ్యవంతులై ఉండాలని అభివృద్ధి చెందిన దేశాల ప్రజలు కోరుకుంటారు. ఇండియాలో ఈ దిశగా ఆలోచించేంత తీరిక కూడా ప్రజల్లో కనిపించకపోయినా, అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ, అభ్యర్థుల ఆరోగ్యం సైతం ఓట్లను ఆకర్షించేదే. ఈ నేపథ్యంలో బరిలోకి దిగే డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ ల ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ల మీద బులెటిన్లు విడుదల అవుతున్నాయి. ఆ వివరాలు సైతం గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. తాజా బులెటిన్ ప్రకారం... డొనాల్డ్ ట్రంప్... * 70 సంవత్సరాల ట్రంప్ వైద్య నివేదికలో కొన్ని వివరాలే ఉన్నాయి. * పదేళ్ల వయసులో అపెండిసైటిస్ శస్త్రచికిత్స జరిగింది. * ప్రొస్టేట్ కేన్సర్ రావచ్చన్న భయంతో క్రమం తప్పక పరీక్షలు చేయించుకుంటారు. * బీపీ నార్మల్, కొలెస్టరాల్ ఉంది. దానికి మందులు (స్టాటిన్స్) వాడుతున్నారు. * గుండెపోటు వచ్చే సమస్య కూడా ఉంది. * కొలోన్ కేన్సర్ నుంచి తప్పించుకునేందుకు మందులు వాడుతున్నారు. * ఏడాదిలో 15 పౌండ్ల బరువు పెరిగారు. * రోజుకు మూడు నుంచి నాలుగు గంటలే నిద్రిస్తారు. హిల్లరీ క్లింటన్... * 69 సంవత్సరాల హిల్లరీకి బీపీ, కొలెస్టరాల్ లేవు. * ఇటీవల గుండె పరీక్షలు చేయించుకుంటే అంతా నార్మల్. * 2012లో మెదడులో రక్తనాళాలు గడ్డకట్టాయి. * ఆపై కోలుకున్న హిల్లరీ, మళ్లీ ఇదే పరిస్థితి రాకుండా రక్తాన్ని పలుచన చేసే మందులు వాడుతున్నారు. * హైపో థైరాయిడిజమ్ ఉంది. దీంతో హార్మోన్ మందులు, విటమిన్ బీ12 ఔషధాలు వాడుతున్నారు. * ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ, యోగా, నడక చేయడంతో పాటు, పళ్లు, కూరగాయలు అధికంగా తింటారు. * సమయానుసారంగా వైద్య పరీక్షలు చేయించుకుంటారు.

  • Loading...

More Telugu News