: సీబీఐ వాళ్లొస్తారు... సిద్ధంగా ఉండు!: ఢిల్లీ డిప్యూటీ సీఎంకు కేజ్రీ హెచ్చరిక!

అదేంటీ... ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇద్దరూ ఒకే పార్టీకి చెందినవారేగా. సిసోడియాను సీబీఐ బూచి చూపి బెదరగొట్టాల్సిన అవసరం కేజ్రీవాల్ కేముందనేగా మీ డౌటు. ఇక్కడ సిసోడియా మీదకు కేజ్రీ... సీబీఐని పంపడం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలతో సీబీఐ అధికారులు విచారణకు శ్రీకారం చుడతారు, సిద్ధంగా ఉండాలని తన అనుంగు సహచరుడు సిసోడియాను కేజ్రీ హెచ్చరించారు. అసలు విషయమేంటంటే... ఇప్పటికే కేజ్రీపై కేంద్రం గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. అందివచ్చిన ప్రతి అంశాన్ని ఆసరా చేసుకుని కేంద్రం కొరడా ఝుళిపిస్తోంది. ఇప్పటికే కేజ్రీ కార్యాలయంలో సీబీఐ అధికారులు సోదా చేశారు. కేజ్రీ కార్యాలయ ముఖ్య కార్యదర్శిని అరెస్ట్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో సిసోడియా ఓ కళాశాల భవనాన్ని కడుతున్నారట. దీనిని కూడా కేంద్రం ఆసరా చేసుకుని సిసోడియాను టార్గెట్ చేస్తుందని కేజ్రీ భయం. అందుకే భవనానికి సంబంధించిన అన్ని అనుమతులు, ఖర్చయిన నిధులతో విచారణకు సిద్ధంగా ఉండాలని తన కేబినెట్ మంత్రిని కేజ్రీ హెచ్చరించారు.