: స్పైస్ జెట్ లో బ్యాగు, అందులో బాంబు?... అమృత్ సర్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్!
పంజాబ్ లోని అమృత్ సర్ లోని విమానాశ్రయంలో నేటి ఉదయం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దుబాయి- అమృత్ సర్ మధ్య రాకపోకలు సాగించే స్పైస్ సెట్ కు చెందిన ఓ విమానంలో అనుమానాస్పద బ్యాగు ఉందన్న విషయం అక్కడి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. విమానంలో పెట్టిన బ్యాగులో బాంబులున్నాయన్న వదంతులతో విమానంలోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే వేగంగా స్పందించిన విమానాశ్రయ సిబ్బంది ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించేశారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ బ్యాగును పరిశీలిస్తోంది. ఎవరికీ చెందని బ్యాగు, అందులో బాంబు ఉందన్న పుకార్లు, బాంబు స్క్వాడ్ రంగప్రవేశంతో ఎయిర్ పోర్ట్ లో హైటెన్షన్ పరిస్థితి నెలకొంది.