: గత ప్రభుత్వాల అభివృద్ధిని మీ గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు: డీకే అరుణ
గత ప్రభుత్వాలు చేసి చూపిన అభివృద్ధిని టీఆర్ఎస్ ప్రభుత్వం తమ గొప్పగా చెప్పుకుంటోందని, ఈ అంశం సిగ్గుచేటని కాంగ్రెస్ మహిళా నేత, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా కనీసం ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు. భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాలను కేసీఆర్ సర్కార్ ప్రారంభించనున్న అంశంపై ఆమె మాట్లాడుతూ.. భీమా, నెట్టెంపాడుల్లో నాలుగేళ్ల క్రితమే పంప్‌హౌస్‌లు పూర్తయ్యాయని నీళ్లు కూడా వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తిరిగి కొత్తగా ప్రారంభోత్సవం చేయడం ఏంటని ఆమె ప్రశ్నించారు.