: బుర్హాన్ వానీని చంపాల్సిన అవసరమేమొచ్చింది?... లోక్ సభలో బీజేపీని నిలదీసిన మిత్రపక్షం పీడీపీ!


జమ్ము కశ్మీర్ లో రోజుల తరబడి అల్లర్లకు కారణమైన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వానీ ఎన్ కౌంటర్ నిన్న లోక్ సభలోనూ కలకలం రేపింది. కేంద్రంలో అధికార పార్టీ బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జమ్ము కశ్మీర్ అధికార పార్టీ పీడీపీ సంధించిన ప్రశ్న సభలో కలకలమే రేపింది. ‘‘అసలు బుర్హాన్ వానీని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది?’’ అంటూ పీడీపీ ఎంపీ ముజఫర్ బేగ్ బీజేపీ సర్కారును నిలదీశారు. ఎన్ కౌంటర్ జరిగిన సమయంపైనా బేగ్ అనుమానాలు వ్యక్తం చేశారు. నిఘా వర్గాల నేత్రాలకు చిక్కిన బుర్హాన్ వానీని అరెస్ట్ చేయకుండా ఎన్ కౌంటర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా ఆయన ప్రశ్నించి పెను కలకలమే రేపారు.

  • Loading...

More Telugu News