: జైలు నుంచి బయటకు వచ్చే రజనీకాంత్... కబాలీ ఫస్ట్ సీన్ ఆన్ లైన్లో!
రేపు వెండితెరను తాకనున్న సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రం 'కబాలి' పూర్తి చిత్రం ఆన్ లైన్లో లీకైందో లేదో తెలియదు గానీ, ప్రారంభ దృశ్యం మాత్రం కనిపిస్తోంది. విదేశాల్లో చిత్ర ప్రదర్శన కోసం ముందే ప్రింట్స్ పంపడం జరుగగా, అరబిక్ సబ్ టైటిల్స్ ఈ సీన్ లో కనిపిస్తుండటంతో, ఏదైనా గల్ఫ్ దేశంలో సినిమా సీన్స్ లీక్ అయి ఉండవచ్చని భావిస్తున్నారు. దాదాపు రెండు నిమిషాలకు పైగా ఉన్న ఈ సీన్ లో రజనీకాంత్ జైలు నుంచి బయటకు వస్తున్న దృశ్యాలున్నాయి. నీలిరంగు దుస్తుల్లో ఉన్న రజనీకాంత్, జైలు నుంచి బయటకు వస్తూ తన దుస్తులు, షూస్ తదితరాలు తీసుకోవడం, సహచరుల చేతులను ప్రేమగా తాకుతూ నడవటం వంటి దృశ్యాలు ఇందుకో కనిపించాయి. ఇక ఇది రజనీ ఇంట్రడక్షన్ సీన్ గా భావిస్తున్న అభిమానులు తినే ముందు రుచి చూస్తున్నట్టుందని సంబరపడుతున్నారు.