: రాష్ట్ర విభజనపై ఏపీ డీజీపీ రేర్ కామెంట్!... హైదరాబాదులో ఏపీకి పేరు, బోర్డులే మిగిలాయని వ్యాఖ్య!
రాష్ట్ర విభజనకు సంబంధించి ఏపీ డీజీపీ జేవీ రాముడు ఓ ఆసక్తికర కామెంట్ చేశారు. ప్రకాశం, పశ్చిమగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో నిన్న సుడిగాలి పర్యటన చేసిన రాముడు... ఆయా ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటైన తీర ప్రాంత పోలీస్ స్టేషన్లతో పాటు పోలీస్ గెస్ట్ హౌస్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా రాష్ట్ర విభజనను ప్రస్తావించిన రాముడు... విభజన తర్వాత హైదరాబాదులో పేరు, బోర్డులు మాత్రమే మిగిలాయని వ్యాఖ్యానించారు. పేరు, బోర్డులు మినహా హైదరాబాదులో ఏపీకి ఏమీ మిగలలేదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఐసీఎస్ అధికారుల విభజన మాత్రమే జరిగిందన్న ఆయన ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది విభజన ఇంకా జరగలేదని చెప్పారు. ఏపీఎస్పీ విభజన జరిగినా... పోలీసు అకాడెమీ విభజన జరగాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.