: డిప్లొమా హోల్డర్లు కూడా కానిస్టేబుల్ పరీక్షకు అర్హులే!: తెలంగాణ పోలీస్ నియామక సంస్థ
కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకానికి పాలిటెక్నిక్ లో డిప్లొమా చేసిన విద్యార్థులు కూడా అర్హులేనని తెలంగాణ పోలీస్ నియామక సంస్థ తెలిపింది. డిప్లొమా హోల్డర్లను అనర్హులుగా ప్రకటిస్తూ తెలంగాణ పొలీస్ నియామక సంస్థ పలువురు విద్యార్థులను వెనక్కి పంపింది. దీనిపై విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో పాలిటెక్నిక్ కోర్సును కూడా ఇంటర్ తో సమానంగా గుర్తిస్తున్నట్టు తెలిపింది. దీంతో తిరస్కరణకు గురైన పాలిటెక్నిక్ అభ్యర్థులు మూడు రోజుల్లోగా పరీక్షా కేంద్రాలకు వెళ్లాలని తెలంగాణ పోలీస్ నియామక సంస్థ సూచించింది.