: నడి రోడ్డుపై ఆగిపోయిన కంటైనర్లు... వాటిలో 1600 కోట్ల రూపాయలు!
రిజర్వ్ బ్యాంక్ కు చెందిన 1600 కోట్ల రూపాయలను కర్ణాటక నుంచి కేరళకు తరలించే క్రమంలో తమిళనాడులోని కరూర్-అరువంకుర్చి వద్ద కంటైనర్ లారీ ఇంజిన్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఆ కంటైనర్లు నడిరోడ్డుపై ఆగిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఈ 1600 కోట్ల రూపాయల నగదును కర్ణాటకలోని మైసూర్ నుంచి కేరళ రాజధాని తిరువనంతపురానికి రెండు కంటైనర్ లారీలు తీసుకెళ్తున్నాయి. లారీలు నడి రోడ్డుపై ఆగిపోయిన సమాచారం అందడంతో, తమిళనాడు పోలీసులు అక్కడికి పరుగులు పెట్టారు. సాయుధ పోలీసులు ఈ డబ్బుకు రక్షణగా నిలిచారు. మరమ్మతులు పూర్తి చేసి వాటిని అక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.