: నా పుట్టినరోజుకు ఎటువంటి ఆర్భాటాలు చేయకండి: మహారాష్ట్ర సీఎం
ఈ నెల 22వ తేదీన పుట్టిన రోజు జరుపుకుంటున్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తన మద్దతుదారులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఒక విజ్ఞప్తి చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి ఆర్భాటాలు చేయవద్దని, బ్యానర్లు, హోర్డింగ్ లు ఏర్పాటు చేసి అనవసరంగా డబ్బు వృథా చేయవద్దని పేర్కొన్నారు. ఈ విధంగా ఖర్చు చేయాలనుకున్నవారు ఆ డబ్బును నీటి సంరక్షణ పథకానికి వినియోగించాలని ఫడ్నవీస్ సూచించారు.