: మోదీ విశ్వసనీయతకు, చంద్రబాబు సమర్థతకు ఈ నెల 22న అగ్ని పరీక్ష: తులసి రెడ్డి
ఈ నెల 22న ప్రధాని నరేంద్ర మోదీ విశ్వసనీయతకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమర్థతకు అగ్నిపరీక్ష అని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి తెలిపారు. ఓ టీవీ ఛానెల్ ద్వారా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన పాపంలో అందరికీ భాగస్వామ్యం ఉందని అన్నారు. విభజనకు అన్ని పార్టీలు అంగీకరించాయని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధాని రాజ్యసభలో ప్రకటన చేశారని ఆయన గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే బీజేపీ పదేళ్ల హోదా ఇస్తామని ప్రకటించిందని, దానిని అమలు చేయడంలో ఆ పార్టీ చిత్తశుద్ధిని ప్రైవేటు బిల్లు తెలియజేస్తుందని ఆయన చెప్పారు.