: కాసుల కక్కుర్తి... జ్వరంతో ఆసుపత్రికి వెళ్తే కిడ్నీ చెడిపోయిందన్నారు: బాధితురాలు


హైదరాబాదులో ప్రైవేటు ఆసుపత్రి కాసుల కక్కుర్తి బయటపడింది. డబ్బు కోసం రోగులను ఏమారుస్తూ, అవసరం లేని ఆపరేషన్లు చేసేందుకు సిద్ధమై రోగుల ప్రాణాలమీదకు తెస్తున్నారు. హైదరాబాదులో ఫార్మసిస్టుగా పని చేస్తున్న చండీరాణి అనే యువతికి జ్వరం రావడంతో దిల్ షుక్ నగర్ కొత్తపేటలోని పేరున్న కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లింది. జ్వరం కోసం ఆసుపత్రికి వెళ్తే పలు పరీక్షలు చేసిన వైద్యులు కిడ్నీ చెడిపోయిందని, కిడ్నీలో 7.7 ఎంఎం రాళ్లు ఉన్నాయని, తక్షణం ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం అని రిపోర్టు ఇచ్చారు. వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో జ్వరం కోసం ఆసుపత్రికి వెళ్తే... కిడ్నీలో రాళ్లు ఎలా వచ్చాయని అనుమానించిన చండీ రాణి దగ్గర్లో ఉన్న మరో క్లినిక్ లో ఆ ఆసుపత్రిలో చేయించుకున్న పరీక్షలు చేయించుకుంది. అక్కడ ఈ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు చెప్పినవన్నీ అబద్ధాలని తేలింది. దీంతో బాధితురాలు ఎల్బీనగర్ డీసీపీకి ఫిర్యాదు చేసింది.

  • Loading...

More Telugu News