: ఊబకాయం కూడా కూడా వారసత్వమేనట!


వారసత్వంగా సంక్రమించే వాటిలో ఊబకాయం (ఒబేసిటి) కూడా ఒకటని ఆస్ట్రేలియాలోని విక్టర్ చాంగ్ యూనివర్సిటీ, గర్వన్ ఇన్ స్టిట్యూట్ ఆప్ మెడికల్ రీసెర్చ్ పరిశోధకులు తేల్చారు. ఎలుకలపై చేసిన పరిశోధనా ఫలితాలను విశ్లేషించిన విక్టర్‌ చాంగ్‌ ఇన్‌ స్టిట్యూట్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ కేథరీన్‌ సూటర్‌ చెబుతున్న దాని ప్రకారం... తాతల జీవక్రియల ఆరోగ్యం (మెటబాలిక్‌ హెల్త్‌) వారికి మాత్రమే పరిమితం కాదని, మరి కొన్ని తరాల వరకూ సంక్రమిస్తుందని అంటున్నారు. ఈ లెక్కన తాతకి స్థూలకాయం ఉంటే కొడుక్కి, అతని నుంచి మనవడు లేదా మనవరాలికీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంతవరకు పరిశోధకులు తల్లి ఆరోగ్యం ప్రభావం మాత్రమే పుట్టబోయే పిల్లలపై ఉంటుందని భావిస్తూ వచ్చారు. అందుకే ఆమెను మరింత జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత ఉందని పేర్కొనేవారు. అయితే తాజా పరిశోధనల ప్రకారం తండ్రి ఆరోగ్యం కూడా పుట్టబోయే శిశువుపైన ప్రభావం చూపుతుందని వారు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News