: తెలంగాణ ప్రభుత్వ అధికారులపై హెచ్చార్సీ ఆగ్రహం
తెలంగాణలో జరుగుతున్న విద్యావ్యవస్థ దోపిడీని అరికట్టాలనే ఫిర్యాదుపై సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 19వ తేదీలోగా కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, రాష్ట్రంలో విద్యా వ్యవస్థ దోపిడీని అరికట్టాలని కోరుతూ తెలంగాణ ప్రైవేటు అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల ఫోరం రెండు నెలల క్రితం హెచ్చార్సీలో ఫిర్యాదు చేసింది. విచారణ నిమిత్తం ఈరోజు హెచ్చార్సీ ముందు ఫోరం ప్రతినిధులు హాజరయ్యారు.