: 15 రోజులపాటు సిబ్బందిని సస్పెండ్ చేసిన సోనూ నిగమ్ పాట


గత జనవరి 4న జోధ్ పూర్ నుంచి ముంబై వెళ్తున్న జెట్ ఎయిర్ వేస్ విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కోరిక మేరకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉపయోగించి ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ పాడిన పాట... ఆ సమయంలో విమానంలో విధులు నిర్వర్తించే సిబ్బందిపై 15 రోజుల పాటు సస్పెన్షన్ వేటు పడేలా చేసిందని కేంద్ర మంత్రి రాజ్యసభకు తెలిపారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ, విమానాల్లో ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడే ప్రశ్నేలేదని అన్నారు. సోనూ నిగమ్ పాట పాడిన సందర్భంలో విమానంలోని కాక్ పిట్ సిబ్బంది, క్యాబిన్ క్రూ ఆరుగురిని 15 రోజుల పాటు సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా దిగిన ఫోటో సోషల్ మీడియాలో రావడంతో జెట్ ఎయిర్ వేస్ అప్పట్లోనే వారిపై చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News