: బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య!


బెంగళూరులోని జెన్ పాక్ట్ సంస్థలో పనిచేస్తున్న టెక్కీ గుల్షన్ చోప్రా నిన్న తెల్లవారు జామున ఆత్మహత్య చేసుకున్నాడు. అతను పని చేసే ఆఫీసులోని 9వ ఫ్లోర్ నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, గుల్షన్ చోప్రా ఆత్మహత్యకు పాల్పడడానికి వారం రోజుల ముందు తన సొంత రాష్ట్రమైన పంజాబ్ లోని తన ఇంటికి వెళ్లి వారం రోజుల పాటు ఉండివచ్చాడన్నారు. ఇటీవలే అతనికి నిశ్చితార్థం కూడా జరిగిందని, నవంబర్ లో పెళ్లి చేయాలని అతని కుటుంబసభ్యుల ద్వారా తెలిసిందన్నారు. ఇంటికి వెళ్లిన గుల్షన్ చోప్రా ఒత్తిడిలో ఉన్నట్లు కనపడ్డాడని, ఆఫీసులో సమస్యలున్నట్లు తమతో ఏమీ చెప్పలేదని కుటుంబసభ్యుల సమాచారమని పోలీసులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News