: మీ మద్దతు కావాలి.. సీఎం చంద్రబాబుకి ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు ఈనెల 22న చర్చకు రానుండడంతో బిల్లుకి మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి లేఖ రాశారు. చంద్రబాబుని ఢిల్లీ రావాల్సిందిగా ఆయన కోరారు. ‘మీ అనుభవంతో పలు రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టాలి’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రత్యేక హోదా అంశం గురించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.