: దయాశంకర్ సింగ్ పై బీజేపీ వేటు ...యూపీలో బీజేపీకి పెద్ద కుదుపు!


ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో బీజేపీని విజయపథాన నిలపాలని భావిస్తున్న అధిష్ఠానాన్ని ఆ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు దయాశకంర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇబ్బందుల్లో పడేశాయి. దీంతో బీజేపీకి దళితులంటే చిన్నచూపు ఉందనే ప్రచారం ఊపందుకోనుంది. ఇదే జరిగితే ఇప్పటికే ముస్లింలకు దూరంగా ఉన్న బీజేపీ, దళితులు, అణగారిన వర్గాలకు కూడా దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ రెండు వర్గాలు దూరమైతే ఇక బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం సంగతి అలా ఉంచితే, చాలా చోట్ల డిపాజిట్ కూడా గల్లంతే! దీంతో ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు బీజేపీ అథిష్ఠానం రంగంలోకి దిగింది. దయాశంకర్ సింగ్ పై వేటు వేసింది. ఆయనను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు యూపీ బీజేపీ అధ్యక్షుడు మౌర్య ప్రకటన చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ లో దళితులపై దాడి సంఘటన ఇప్పటికే పార్టీని తీవ్ర విమర్శలపాలు చేస్తుండగా, మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు మాయావతిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆ పార్టీని మరింత ఇరకాటంలో పడేశాయి. ఈ చర్య ద్వారా లక్ష్మణ రేఖ దాటవద్దని పార్టీ నేతలను హెచ్చరించడంతో పాటు, దళితుల పక్షాన పార్టీ నిలబడుతుందని చాటినట్టవుతుందని, డేమేజీ కాస్త తగ్గుతుందని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది.

  • Loading...

More Telugu News