: మాయావతి బాధను అర్థం చేసుకుంటాం: బీజేపీ నేత దయాశంకర్ సింగ్ అభ్యంతరకర వ్యాఖ్యలపై జైట్లీ
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతిపై బీజేపీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ వ్యక్తిగత దూషణకు పాల్పడుతూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన అంశంపై రాజ్యసభలో ఈరోజు కేంద్ర అర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ స్పందించారు. మాయావతిపై తమ పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు పట్ల తాను విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దయాశంకర్ సింగ్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తనను బాధించాయని ఆయన పేర్కొన్నారు. మాయావతికి తమ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. మాయావతి బాధను అర్థం చేసుకుంటామని జైట్లీ పేర్కొన్నారు.