: ముందు మైండ్ సెట్ మార్చుకోండి...ఇవి టెస్టులు: కుంబ్లే హిత బోధ


టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే విండీస్ తో సిరీస్ దగ్గర పడుతున్న కొద్దీ ఆటగాళ్లలో విజయానికి కావాల్సిన వ్యూహాలను నూరిపోస్తున్నాడు. నెట్ ప్రాక్టీస్ లో తీవ్రంగా శ్రమిస్తున్న ఆటగాళ్లలో మానసిక మార్పులు తెచ్చే దిశగా ప్రణాళిక ప్రారంభించాడు. ఆటగాళ్ల షాట్లను గమనించిన కుంబ్లే... దూకుడుగా ఆడే బ్యాట్స్ మన్ కు మైండ్ సెట్ మార్చుకొమ్మని చెబుతున్నాడు. ఇంత వరకు టీ20లు ఆడిన ఆటగాళ్లు వాటికి అలవాటుపడడం తప్పుకాదని పేర్కొన్న కుంబ్లే...ఇప్పుడు ఆడాల్సినవి టెస్టులని గుర్తు చేస్తున్నాడు. క్రీజులో గంటల తరబడి ఓపిగ్గా బంతికోసం నిరీక్షించాలని సూచించాడు. బౌలర్ అలిసిపోయినప్పుడు దాడికి దిగాలని చెబుతున్నాడు. టెస్టులో విజయం సాధించాలంటే పరుగులు చేయడం కేవలం బ్యాట్స్ మన్ పని అని బౌలర్లు అనుకోకూడదని, బౌలర్లు కూడా పరుగులు సాధించాలని సూచించాడు. టెస్టుల్లో విజయం సాధించడంలో స్పిన్నర్లది కీలక పాత్ర అని చెప్పిన కుంబ్లే... బ్యాట్స్ మన్ కైనా, బౌలర్ కైనా, ఫీల్డర్ కైనా, కీపర్ నైనా టెస్టుల్లో ఆటతీరును బట్టే ప్రతిభను అంచనా వేయవచ్చని తెలిపాడు. టెస్టుల్లో ప్రదర్శించే ప్రతిభే అతను ఎలాంటి క్రికెటర్ అన్న సంగతి తెలియజేస్తుందని ఆయన చెప్పాడు.

  • Loading...

More Telugu News