: కత్రినా ఫీలవలేదు కానీ అభిమానులు మాత్రం ఫీలవుతున్నారు!
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ సీరియస్ గా తీసుకోలేదు కానీ, ఆమె అభిమానులు మాత్రం ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఇంతకీ, ఏమిటా విషయమంటే, మూడు రోజుల క్రితం కత్రినా కైఫ్ పుట్టినరోజు వచ్చింది. ఈ సందర్భంగా ‘భజరంగీ భాయీజాన్’ చిత్రంలోని బాలనటి హర్షాలీమల్హోత్రా ట్విట్టర్ ఖాతా ద్వారా ‘హ్యాపీ బర్త్ డే కత్రినా కైఫ్ ఆంటీ’ అని ట్వీట్ చేసింది. తనను ఆంటీ అన్నందుకు కత్రినా అయితే ఫీలవ్వలేదు గానీ, ఆమె అభిమానులు మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డారట. ‘ఆంటీ’ ఏమిటీ ‘అక్కా’ అని పిలవచ్చుకదా? అంటూ హర్షాలీపై విమర్శలు గుప్పిస్తూ అభిమానులు కత్రినాకు ట్వీట్లు చేశారు.