: తప్పు జరిగిపోయిందని క్షమాపణ చెప్పిన తిరుపతి స్విమ్స్


వివిధ ఆసుపత్రులకు సర్క్యులర్ ను జారీ చేసిన విషయంలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల తప్పు జరిగిపోయిందని స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ వ్యాఖ్యానించారు. దీని వల్ల పలువురికి మనస్తాపం కలిగిందని, అందుకు క్షమించాలని, తక్షణం సర్క్యులర్ ను వెనక్కు తీసుకుంటున్నామని తెలిపారు. అన్ని రకాల అత్యవసర సేవలు అవసరమైన రోగులను ఇక్కడ చేర్చుకునేందుకు ఎలాంటి అభ్యంతరాలూ లేవని తెలిపారు. ఆసుపత్రుల వెంటిలేటర్ల సంఖ్యను పెంచుతామని చెప్పారు. కాగా, ఈ ఉదయం వెంటిలేటర్ల సంఖ్య తక్కువగా ఉన్నందున, తమకు ముందస్తు అనుమతి లేకుండా రోగులను తేవద్దని స్విమ్స్ ఆదేశాలు జారీ చేయగా, దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News