: వివాదానికి చెక్ పడేనా!... కృష్ణా బోర్డు భేటీకి అస్త్రశస్త్రాలతో వెళ్లిన తెలుగు రాష్ట్రాలు!
తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల మధ్య చిచ్చు రాజేసిన కృష్ణా జలాల పంపిణీ వివాదానికి చెక్ పెట్టేందుకు కృష్ణా నదీజలాల యాజమాన్య బోర్డు ఆధ్వర్యంలో కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో కీలక భేటీ ప్రారంభమైంది. బోర్డు సభ్యులతో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన కీలక శాఖల అధికారులు కూడా ఈ భేటీకి హాజరయ్యారు. గతంలో మాదిరిగానే ఎవరి వాదనలు వారు వినిపించేందుకు ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు సర్వం సిద్ధం చేసుకుని సమావేశానికి వెళ్లినట్లు సమాచారం. ఇటీవల రెండు రాష్ట్రాల కీలక మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, తన్నీరు హరీశ్ రావుల సమక్షంలో జరిగిన చర్చలు ఫలించని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా బేటీలోనైనా ఈ వివాదానికి చెక్ పడుతుందా? అన్న అంశంపై ఆసక్తి నెలకొంది.