: జీఎస్‌టీ బిల్లు ఆమోదం పొందుతుంది.. ప్రతిపక్షాల నుంచి సానుకూల స్పందన ఉంది: వెంకయ్య


వస్తు-సేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లు ఆమోదానికి అన్ని పార్టీలతో చర్చించి ఏకాభిప్రాయానికి వ‌స్తామ‌ని కేంద్ర స‌మాచార శాఖ మంత్రి వెంక‌య్య‌నాయుడు తెలిపారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై కేంద్ర‌మంత్రులు ఢిల్లీలోని ప్రధాని మోదీ ఆఫీస్‌లో ఈరోజు స‌మావేశ‌మ‌య్యారు. అనంత‌రం వెంక‌య్య‌నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌తిప‌క్షాల‌నుంచి బిల్లు విషయంపై మంచి స్పందనే వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం కొన‌సాగుతోన్న వ‌ర్షాకాల స‌మావేశాల్లోనే ఈ బిల్లు ఆమోదం పొందుతుంద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఈ బిల్లు ఆమోదం పొందితే రాష్ట్రాలు మంచి ప్ర‌యోజ‌నాన్ని పొందుతాయ‌ని ఆయ‌న తెలిపారు.

  • Loading...

More Telugu News