: గర్ల్ ఫ్రెండ్ ను చావగొట్టిన హాలీవుడ్ హీరో టామ్ సీజ్ మోర్ అరెస్ట్


గర్ల్ ఫ్రెండ్ ను తన ఇంట్లో చావగొట్టిన నేరానికి హాలీవుడ్ హీరో టామ్ సీజ్ మోర్ (సేవింగ్ ప్రైవేట్ ర్యాన్, బ్లాక్ హాక్ డౌన్ ఫేమ్) ను లాస్ ఏంజిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫెడరల్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, టామ్ ఇంటి నుంచి 911కు పదే పదే ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కానీ ఎవరూ మాట్లాడటం లేదు. ఫోన్ కాల్స్ లో ఎవరో ఏడుస్తున్నట్టు, కేకలు పెడుతున్నట్టు వినిపించింది. దీంతో ఓ టీమ్ హుటాహుటిన ఆయన ఇంటికి వెళ్లింది. తొలుత తన స్నేహితురాలితో గొడవ పడిన టామ్, అనంతరం చేయి చేసుకున్నాడని గుర్తించారు. తన ముఖం, తలపై కొట్టాడని ఆమె ఫిర్యాదు చేయగా, గాయాలు పైకి కనిపిస్తుండటంతో పోలీసులు టామ్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, వైద్య పరీక్షలు చేయించుకుని టామ్ పై గట్టి కేసు నమోదయ్యేలా చూసేందుకు మాత్రం ఆమె నిరాకరించిందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News