: పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలపై సుప్రీంకోర్టులో విచారణ
పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ వివాదాన్ని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, పలు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉన్న అపెక్స్ కౌన్సిల్ పరిష్కరిస్తుందని సుప్రీం తెలిపింది. పాలమూరు, డిండి ప్రాజక్టులు తమ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయని విజయవాడ వాసి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు ఎత్తిపోతల పథకాలు పాతవేనని ప్రభుత్వ సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ సుప్రీం కోర్టుకు విన్నవిస్తే... పాలమూరు, డిండి ప్రాజక్టులను విభజన తర్వాతే ప్రారంభించారని ఆంధ్రప్రదేశ్ సర్కార్ న్యాయవాది తమ వాదనను వినిపించారు.