: మిస్టర్ వరల్డ్ గా రోహిత్!... తొలి భారతీయుడిగా హైదరాబాదీ యువకుడి ఘనత!


మిస్టర్ వరల్డ్- 2016గా హైదరాబాదుకు చెందిన యువకుడు రోహిత్ ఖండేల్ వాల్ ఎంపికయ్యాడు. భారత్ కు ఇప్పటిదాకా దక్కని ఈ కిరీటాన్ని చేజిక్కించుకున్న తొలి ఇండియన్ గా ఈ హైదరాబాదీ కుర్రాడు రికార్డులకెక్కాడు. నిన్న దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 47 మంది యువకులు పాల్గొనగా, అందరినీ వెనక్కి నెట్టిన రోహిత్ 'మిస్టర్ వరల్డ్' టైటిల్ ను గెలిచాడు. టైటిల్ తో పాటు అతడు 50 వేల డాలర్ల (దాదాపు రూ.35 లక్షలు)ను ప్రైజ్ మనీగా గెలుపొందాడు. పోటీలు ముగిసిన వెంటనే ‘మిస్టర్ వరల్డ్- 2016’ నిర్వాహకులు తమ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో రోహిత్ విజయాన్ని ప్రకటించారు. పోటీకి సంబంధించి ఫొటోలను కూడా తమ ఖాతాలో అప్ లోడ్ చేశారు.

  • Loading...

More Telugu News