: హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ముట్టడికి యత్నించిన టీఎన్ఎస్ఎఫ్.. తీవ్ర ఉద్రిక్తత
హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఈరోజు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్యాలయ ముట్టడికి తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్(టీఎన్ఎస్ఎఫ్) కార్యకర్తలు ప్రయత్నించారు. ఆందోళనకు దిగిన విద్యార్థి నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోతుండడంతో వారిని అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్కి తరలించారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో సర్కార్ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని టీఎన్ఎస్ఎఫ్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని వారు అన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేవరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.