: పార్లమెంట్ ఉభయసభల్లో గందరగోళం.. రాజ్యసభలో వెల్‌లోకి దూసుకెళ్లిన బీఎస్పీ, కాంగ్రెస్ ఎంపీలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మూడోరోజు కొనసాగుతున్నాయి. అయితే, పార్లమెంట్ ఉభయసభల్లో ఈరోజు గందరగోళం నెలకొంది. గుజరాత్‌లో దళితులపై దాడి ఘటనపై చర్చించాలని లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్షాలు పట్టుబట్టాయి. రాజ్యసభలో బీఎస్పీ, కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో చైర్మన్ రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. లోక్‌సభలోనూ విపక్షాలు గుజరాత్ ఘటనపై చర్చించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి.