: ఖమ్మం జిల్లా మున్సిపల్ కార్యాలయం ముందు ఎమ్మెల్సీ పొంగులేటి దీక్ష
ఖమ్మం జిల్లా మున్సిపల్ కార్యాలయం ముందు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఈరోజు దీక్షకు దిగారు. దుమ్ముగూడం ప్రాజెక్టు పేరు మార్చొద్దని, ప్రజల ఆకాంక్షమేరకే ప్రాజెక్టులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. సర్కారు చేస్తోన్న ప్రాజెక్టుల రీడిజైన్ పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. రీడిజైనింగ్‌తో శబరి నీటిపై హక్కు కోల్పోతున్నామని ఆయన పేర్కొన్నారు. మూడోదశ రుణమాఫీ అమలు ఇంతవరకు జరగలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు రైతుల సంక్షేమాన్ని మరుస్తోందని ఆయన మండిపడ్డారు.