: కర్నూలు జిల్లాలో బీటెక్ యువకుడి ప్రాణాలు తీసిన 'పట్టాలపై సెల్ఫీ'
తమ సెల్ ఫోన్లలో సెల్ఫీలు తీసుకుని వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి లైకుల మీద లైకులు సాధించుకోవాలన్న ఆ యువకుడి ఆత్రుత నూరు సంవత్సరాల నిండు జీవితాన్ని బలిగొంది. ఈ ఘటన కర్నూలు జిల్లా పాణ్యం మండలం నెరవాడ సమీపంలో జరిగింది. పట్టాలపై నిలబడి వెనుక నుంచి రైలు వస్తున్న వేళ, సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన యువకుడిని వేగంగా వస్తున్న రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు ఆర్బీఎం కాలేజీకి చెందిన బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఖుద్దూస్ గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు.