: కింకర్తవ్యం!... కేవీపీ బిల్లుకు మద్దతు కూడగట్టేందుకు రంగంలోకి కాంగ్రెస్ ప్రముఖులు!


ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు మరో రెండు రోజుల్లో చర్చకు రానుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు తమ వైఖరిని సుస్పష్టం చేశాయి. మిగిలిన పార్టీల విషయాన్ని పక్కనబెడితే... కేంద్రంలోని అధికార బీజేపీ మాత్రం ఈ బిల్లు నెగ్గకుండా చూడాలని కంకణం కట్టుకుంది. ఈ మేరకు ఆ పార్టీ ఏపీ శాఖకు చెందిన కీలక నేత హరిబాబు నేటి ఉదయం ఆ పార్టీ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో బిల్లుపై చర్చకు రెండు రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్యులు రంగంలోకి దిగిపోయారు. ఇప్పటికే పార్లమెంటు సమావేశాల కోసం కేవీపీ ఢిల్లీకి చేరుకోగా తాజాగా ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కూడా హస్తినకు చేరుకున్నారు. ఇక రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ కూడా తనదైన శైలిలో మంత్రాంగం నడుపుతున్నారు. రాజ్యసభలో కేవీపీ బిల్లుకు ఆమోదం లభించేలా చేయడంతో ఏపీలో పార్టీ మైలేజీని పెంచుకోవడంతో పాటు అధికార బీజేపీపై పట్టు సాధించే దిశగా కాంగ్రెస్ సీనియర్లు పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు.

  • Loading...

More Telugu News