: తెలంగాణలోకి ప్రవేశించిన కృష్ణా వరద... ప్రజల సంబరాలు


ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ తెలంగాణలోకి ప్రవేశించింది. ఆ రెండు రిజర్వాయర్లూ నిండుకుండలా మారడంతో వచ్చిన నీటిని వచ్చినట్టు అధికారులు కిందకు వదులుతుండగా, కొద్దిసేపటి క్రితం నీరు తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాను తాకింది. అప్పటివరకూ నీలి రంగులో ఉన్న నీళ్లు, ఎరుపు రంగులోకి మారింది. దీంతో అక్కడి స్థానిక ప్రజలు సంబరాలు చేసుకుంటూ, కృష్ణమ్మకు పూజలు జరిపారు. ఈ సాయంత్రానికి వరద నీరు జూరాల ప్రాజెక్టుకు చేరుతుందని అధికారులు వివరించారు. రేపు సాయంత్రం లేదా ఎల్లుండి జూరాల నుంచి శ్రీశైలానికి నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News