: అగ్రిగోల్డ్ మోసానికి మరో ప్రాణం బలి!... ‘అనంత’లో గుండెపోటుతో ఏజెంట్ మృత్యువాత!


అతి తక్కువ కాలంలోనే కళ్లు చెదిరే వడ్డీతో రెట్టింపు ఆదాయాన్ని అందజేస్తామంటూ నయా మోసానికి పాల్పడ్డ అగ్రిగోల్డ్ యాజమాన్యం వైఖరి కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే అగ్రిగోల్డ్ మోసంతో చాలా మందే చనిపోయారు. తాజాగా అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం చమిలేపల్లిలో ఆ సంస్థకు ఏజెంట్ గా పనిచేసిన ఆంజనేయులు అనే వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు. సంస్థ మాయ మాటలు నమ్మిన ఆంజనేయులు తనకు తెలిసిన వారి చేత రూ.25 లక్షల మేర డిపాజిట్ చేయించారు. అయితే అగ్రిగోల్డ్ మోసం బయటపడటంతో ఇటీవల ఆయనపై డిపాజిట్ దారుల ఒత్తిడి పెరిగింది. ఈ ఒత్తిడి తట్టుకోలేక నిన్న రాత్రి ఆయన గుండెపోటుకు గురయ్యాడు. ఆసుపత్రికి తరలించేలోగానే ఆయన ప్రాణాలు విడిచాడు. దీంతో ఆంజనేయులు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

  • Loading...

More Telugu News