: ఢిల్లీలో బిజీబిజీగా కేటీఆర్!... కేంద్రమంత్రి వెంకయ్యతో భేటీ!


తన తండ్రి, తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఉండగానే హస్తిన పర్యటనకు బయలుదేరి వెళ్లిన టీఆర్ఎస్ యువ నేత, తెలంగాణ కీలక మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బిజీబిజీగా మారిపోయారు. అంతర్రాష్ట్ర మండలి సమావేశం కోసమంటూ ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ జ్వరం కారణంగా అక్కడే రెస్ట్ లోకి వెళ్లగా కేటీఆర్ రంగంలోకి దిగారు. ఓ వాణిజ్య సదస్సుకు హాజరయ్యే నిమిత్తం ఢిల్లీ వెళ్లిన కేటీఆర్... నిన్న కేంద్ర మంత్రి కల్ రాజ్ మిశ్రాతో కీలక భేటీ నిర్వహించారు. తాజాగా నేటి ఉదయమే రంగంలోకి దిగిన ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడితో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏఏ అంశాలు చర్చకొచ్చాయన్న విషయం తెలియరాలేదు.

  • Loading...

More Telugu News