: వ్యూహాలకు పదును పెడుతున్న కాంగ్రెస్!... నేడు పార్లమెంటరీ పార్టీ భేటీకి సోనియా ఆదేశం!


పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైపోయాయి. సభలో వ్యవహరించాల్సిన వ్యూహంపై ఇప్పటికే అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలు సమావేశమై తమ వైఖరిని వెల్లడించాయి. అయితే గ్రాండ్ ఓల్డ్ పార్టీగా కీర్తీ ప్రతిష్ఠలున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా తన వ్యూహాన్నే ఖరారు చేసుకోలేదు. పార్లమెంటు సమావేశాలు మొదలైన మూడో రోజు కాని దీనిపై ఆ పార్టీ దృష్టి సారించలేకపోయింది. నేడు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీ జరగనుంది. ఈ భేటీలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై కీలక చర్చ జరగనుంది. ఇప్పటికే బీజేపీ ప్రతిపాదించిన జీఎస్టీ బిల్లుకు ఓకే చెప్పేసిన కాంగ్రెస్ పార్టీ నేటి భేటీలో ఏ తరహా వ్యూహాన్ని ప్రకటిస్తుందన్న అంశంపై ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News