: టర్కీలో 42 హెలికాప్టర్లు మాయం... మరో సైనిక చర్యకు కుట్ర!
గతవారంలో సైనిక కుట్ర జరిగిన టర్కీలో సైనిక స్థావరాల నుంచి 42 హెలికాప్టర్లు మాయం కావడం కలకలం సృష్టిస్తోంది. సైనిక తిరుగుబాటు అనంతరం ఇవి కనిపించకుండా పోయాయని అధికార వర్గాలు అంటున్నాయి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న అధ్యక్షుడు ఎర్డోగాన్, వాటిని వెతికేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మరోసారి సైనిక చర్యతో ప్రభుత్వాన్ని కూల్చివేయాలన్న కుట్రతోనే కొందరు సైనికులు, అధికారులు వీటిని ఎత్తుకెళ్లి ఉండవచ్చని తెలుస్తోంది. టర్కీలో జరిగిన సైనిక చర్యను ప్రజలే అడ్డుకోగా, ఘర్షణల్లో దాదాపు 300 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. ఇందుకు కారణమని చెబుతూ, 6 వేల మందికి పైగా సైనికులు, న్యాయమూర్తులు, అధికారులను అరెస్ట్ చేసిన టర్కీ ప్రభుత్వం వారందరికీ ఉరిశిక్ష విధించాలని భావిస్తోంది.