: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం!... తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు!
తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ సహా ఓడిశా తదితర రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తాయట. ఈ మేరకు విశాఖ వాతావరణ కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం కారణంగానే ఈ వర్షాలు కురవనున్నట్లు ఆ కేంద్రం వెల్లడించింది. రాయలసీమ సమీపాన ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం కారణంగా పాలమూరు, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉంటుందని ఆ ప్రకటనలో ఆ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే... రేపు కోస్తా తీరం వెంట మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని, దీని కారణంగా ఇరు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు.