: అసదుద్దీన్ ఒవైసీకి మరో షాక్!... న్యాయ సాయం అవసరం లేదన్న ఐఎస్ ఉగ్రవాదుల కుటుంబాలు!


భాగ్యనగరిలో పెను విధ్వంసానికి పక్కా ప్లాన్ వేసి అడ్డంగా దొరికిపోయిన ఐఎస్ అనుమానిత ఉగ్రవాదులకు న్యాయ సాయం అందజేస్తామని ప్రకటించిన మజ్లిస్ అధినేత, హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. తాజాగా మీ సాయం మాకొద్దంటూ అరెస్టైన ఉగ్రవాదుల కుటుంబ సభ్యులు ఒవైసీకి తేల్చిచెప్పారు. ఉగ్రవాదులకు న్యాయ సాయం ఎలా చేస్తారంటూ ఒవైసీపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై ఆయనపై ఇప్పటికే పలు ప్రాంతాల్లో దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో అరెస్టైన ఉగ్రవాదులకు చెందిన కుటుంబాలు నిన్న తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని కలిశాయి. ఈ సందర్భంగా తమకు ఒవైసీ న్యాయ సాయం అక్కర్లేదని ఆ కుటుంబాలు సంఘానికి తెలిపాయి. తమ వారి అరెస్ట్ లను బూచిగా చూపి రాజకీయంగా లబ్ధి పొందేందుకే ఒవైసీ యత్నిస్తున్నారని కూడా ఆ కుటుంబాలు ఆరోపించాయి.

  • Loading...

More Telugu News