: వైఎస్సార్సీపీ ఎంపీలతో మాట్లాడిన మంత్రి వెంకయ్యనాయుడు


రాజ్యసభలో జీఎస్టీ బిల్లు, ఏపీకి ప్రత్యేక హోదా ప్రైవేట్ మెంబర్ బిల్లుకు ఆమోదం విషయమై వైఎస్సార్సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహనరెడ్డి, వైవీ సుబ్బారెడ్డితో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడారు. ఈ రెండు అంశాలకు సంబంధించి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారని, అందుకు తాము సరేనని చెప్పామని ఆ ఇద్దరు ఎంపీలు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం జగన్ ఎన్నో పోరాటాలు చేశారని, పార్లమెంట్ లో అనేక సార్లు ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తామని, ప్రత్యేక హోదా కోసం దీక్షలు, ధర్నాలు కూడా చేశామని వారు పేర్కొన్నారు. బిల్లు ఎవరు పెట్టారనే దాని కన్నా ప్రత్యేక హోదా రావడమే ముఖ్యంగా భావిస్తున్నామని రాజమోహన రెడ్డి, సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News