: ఏపీ ఉపసభాపతి ఊళ్లోని తారురోడ్డు మట్టి రోడ్డయిపోయింది!


ఏపీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ నియోజకవర్గం కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ. ఆ ఊళ్లో ఆయన కార్యాలయం, ఇల్లు ఉన్న ప్రదేశానికి వెళ్లాలన్నా, నాలుగు గ్రామాలకు వెళ్లాలన్నా ఆధారమైన ప్రధాన రహదారి అయిన తారురోడ్డు.. ఇప్పుడు మట్టి రోడ్డయిపోయింది. ఎందుకంటే, అక్కడి కొత్తపేట రోడ్డులో ఉన్న రజకుల చెరువుకు పైపులైన్ వేసే నిమిత్తం వారం రోజుల క్రితం పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో తూములు ఏర్పాటు చేశాక అక్కడి మట్టిని తొలగించకపోవడం, మట్టిదిబ్బలను అక్కడే వదలివేయడంతో ఇటీవల కురిసిన వర్షాలకు ఆ మట్టంతా తారురోడ్డు పైకి చేరడంతో మట్టి రోడ్డుగా మారిపోయింది. దీంతో, కొత్తపేట, రామకోటిపురం, తిప్పపాలెం, రామచంద్రపురం గ్రామాలకు వెళ్లే ఆ రహదారిపై ప్రయాణించే గ్రామస్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరో విషయమేమిటంటే, కొత్తపేటలో ఉన్న అతిపెద్ద పుష్కర ఘాట్ కు వెళ్లేందుకూ ఇదే రహదారిని ఉపయోగించాలి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సత్వర చర్యలు తీసుకుని ఆ తారురోడ్డును బాగుచేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

  • Loading...

More Telugu News