: ‘గూగుల్’ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన చెన్నై యువకుడు


సెర్చ్ ఇంజన్ దిగ్గజ కంపెనీ గూగుల్ కమ్యూనిటీ ఇంపాక్ట్ అవార్డును చెన్నైకు చెందిన పద్నాలుగేళ్ల కుర్రాడు అడవై రమేశ్ దక్కించుకున్నాడు. గూగుల్ ఇండియా ఈరోజు ఈ అవార్డులను ప్రకటించింది. గూగుల్ సైన్స్ ఫెయిర్ 2016 లో భాగంగా 107 దేశాల నుంచి వేలాది ప్రాజెక్టులను సేకరించింది. రమేశ్ రూపొందించిన ‘ఫిషర్ మెన్ లైఫ్ లైన్ టెర్మినల్’కు ఆసియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు కింద 10 వేల డాలర్లతో పాటు సైంటిఫిక్ అమెరికన్ సంస్థ నుంచి ఏడాదిపాటు శిక్షణకు రమేశ్ ఎంపికయ్యాడు. చెన్నైలోని నేషనల్ పబ్లిక్ స్కూల్ లో పదో తరగతి చదువుతున్న రమేశ్ ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశాడు. తన ఆలోచనలకు మరింత పదునుపెట్టుకునేందుకు ఈ అవార్డు ఉపయోగపడుతుందని చెప్పాడు. కాగా, జీపీఎస్ విధానంతో మత్స్యకారులు తమ భద్రతతో పాటు చేపల ఉత్పాదకతను ఎలా పెంచవచ్చో ఈ ప్రయోగం వివరిస్తుంది.

  • Loading...

More Telugu News