: ఆర్టీసీ ఎన్నికల్లో సత్తా చాటిన టీఎంయూ
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 95 ఆర్టీసీ డిపోల్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ విజయం సాధించింది. ఖమ్మం జిల్లాలో విజయం సాధించి సత్తాచాటిన టీఎంయూ, ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని డిపోల్లో విజయం సాధించి తనకు ఎదురులేదని చాటింది. మహబూబ్ నగర్ జిల్లాలో 9 డిపోల్లో విజయం సాధించిన టీఎంయూ, మెదక్ జిల్లాలో ఏడు డిపోలను గెలుచుకుంది. కరీంనగర్ జిల్లాలో 10 డిపోల్లో విజయం సాధించింది. దీంతో మెజారిటీ స్థానాల్లో టీఎంయూ విజయం సాధించి సత్తా చాటింది.